రామిళ్ల రాధిక, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉపాధి కల్పించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న అనేక మంది సామాన్యులకు ఇప్పటికీ పట్టాలు అందలేదు. చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
బాల్క సుమన్ ఆధ్వర్యంలో సాండ్ మాఫియా రెచ్చిపోతోంది. కోటపల్లి మండలంలోని కొల్లూరులో ప్రతిరోజూ వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బాల్క సుమన్ వందల కోట్లు సంపాదించారు. ఇక్కడ సంపాదిస్తున్న అక్రమ సంపాదనలో కేటీఆర్ కు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి వ్యక్తులకు వాటాలు వెళ్తున్నాయి.
సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. బాల్క సుమన్ కు బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు ఉన్న ఆస్తులు ఎన్ని? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని..? శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా?