టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర హీరోలందరి సరసన నటించి మూడు పదుల వయసు మీద పడిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది త్రిష. త్రిష ప్రస్తుతం రాంగీ సినిమా చేస్తుంది. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక త్రిష ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే కథ బాగుంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం ఓకే చేస్తోంది.