సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు అప్పుడప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేయాలని అనుకుంటారు.పైగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఫాలోవర్స్ ను తమ అందాలతో మెప్పించాలని చూస్తూ ఉంటారు.దీంతో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్ తో తమ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వెరైటీగా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ సమయంలో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.
తాజాగా రాశి ఖన్నా కూడా కొత్త గెటప్ తో కనిపించింది.దీంతో ఆమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది.ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.తొలిసారి సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ లో పరిచయమైంది రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.అలా తొలిసారిగా అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా సన్నబడి మరింత అందాన్ని పెంచింది.
ఈ బ్యూటీ సన్నబడ్డాక మాత్రం ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో తనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.
కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ బాగా గ్లామర్ షో చేస్తుంది.కానీ ఒకప్పుడు అందుకున్నంత అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది ఈ ముద్దుగుమ్మ.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అయితే అందులో తను న్యూ లుక్ లో కనిపించింది.అంటే అది తను నటించిన సినిమాల్లోని పాత్ర అన్నట్లు తెలుస్తుంది.అయితే ఆమె అందులో ఒక యూనిఫామ్ లో కనిపించింది.ఇక ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా ఆ ఫోటోకు తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.
అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ ఓ నెటిజన్ మాత్రం.
మొత్తానికి నేను ఫిమేల్ బస్ కండక్టర్ ని చూశాను అంటూ.అంటే తను కండక్టర్ లాగా ఉంది అన్నట్లు కామెంట్ పెట్టారు.ప్రస్తుతం ఆ కామెంట్ కూడా వైరల్ అవుతుంది.