రాశి ఖన్నా అతిగా అందాలను ఆరబోయకుండా హద్దుల్లో ఉంటూ అభిమానుల చేత శెభాష్ అనిపించుకున్న హీరోయిన్. ఆమె నటించిన సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ చాలామంది అభిమానులనే సంపాదించుకుంది. అయితే ఆమె నటించిన టీజర్ చూసి అభిమానులు నొచ్చుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ లో రాశి ఖన్నా నటించిన బెడ్ రూమ్ సీన్ అభిమానులను హార్ట్ చేసింది. రాశిఖన్నా ఇలా ఎక్స్‌పోజింగ్ చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాశి వివరణ ఇచ్చింది.
ఈ సినిమా టీజర్ చూసి అభిమానులు బాధపడిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపింది. తాను కూడా ఈ విషయంలో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. టీజర్ చూసి ఏదేదో అనుకున్నారని..కానీ సినిమా చూశాక వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటారని చెప్పింది. తన కెరీర్ లో కథల పరంగా ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని.. ఈ సినిమాలో నా పాత్ర
కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.