హీరోహీరోయిన్లు డేటింగ్స్ సహజం. అయితే అందులో చాలా అభిప్రాయాలు కలవాలి. ఇష్టంలేని డేటింగ్ చిరాగ్గా ఉంటుంది. అలాంటి ఇష్టంలేని డేటింగ్ కు వెళ్లాల్సి వస్తే రాశిఖన్నా ఏం చేస్తుంది? ఎలా తప్పించుకుంటుంది? డైటింగ్ ను ఎగ్గొట్టేందుకు ఆమె చెప్పే సాకులేంటి?
“డేటింగ్ నచ్చకపోతే నేను ఎలాంటి సాకులు చెప్పను. నాకు ఇష్టం లేదని మొహం మీద చెప్పేస్తాను. డేట్ కు ఎటెండ్ అయిన తర్వాత నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతాను. నచ్చని డేట్ లో కూర్చొని ఎందుకు నా టైమ్ వేస్ట్ చేసుకుంటాను.”
ఇలా నిర్మోహమాటంగా తన మనసులో మాట బయటపెట్టింది రాశిఖన్నా. ఇదే ప్రశ్నకు నాగచైతన్య మాత్రం సాకులు వెదికాడు. ఇష్టం లేని డేట్ తప్పించుకోవాల్సి వస్తే, పొద్దున్నే షూటింగ్ ఉందని చెబుతాడట చై. లేకపోతే కడుపులో నొప్పి లేదా జ్వరం అని చెబుతాడంట. ఒకవేళ ఆల్రెడీ డేట్ లో కూర్చొని, అది ఇష్టం లేకపోతే మాత్రం అయిష్టంగానైనా ఆ డేట్ ను పూర్తి చేస్తాడట.
రాశిఖన్నా, నాగచైతన్య కలిసి థాంక్యూ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇలా తమ మనసులో మాట బయటపెట్టారు. సమంత నుంచి విడిపోయి సింగిల్ గా ఉన్నాడు నాగచైతన్య. ఇక రాశిఖన్నా ఆల్రెడీ సింగిల్. దీంతో డేటింగ్ గురించి వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుతుంటే చాలామందికి ఆసక్తికరంగా అనిపించింది.