నకిలీ కరెన్సీ 2000, 500 నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు కు సంబంధించి మీడియా ముందుకు వచ్చారు మహేష్ భగవత్. కరీంనగర్‌కు చెందిన మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు.
నిందితుల నుంచి కూడా రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నామని అన్నారు సీపీ. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ అప్రమతంగా ఉండాలని…దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకి తేడా ఉంటుందని అన్నారు.