న్యూఇయర్ వేడుకలకు సంబంధించి రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఓఆర్‌ఆర్ పై కార్లకు అనుమతి లేదని.. శనివారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఓఆర్‌ఆర్ పై లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్న పోలీసులు.. టికెట్లు ఉన్నవారినే విమానాశ్రయానికి పంపుతామని స్పష్టం చేశారు. అలాగే 31 రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేసి ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. మస్ట్ గా యూనిఫాం ధరించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేయొద్దని ఆదేశించారు పోలీసులు. అలా చేస్తే రూ.500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాట్సాప్ నంబరు 9490617111కి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు.