యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ లో నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా అంటూ పూజా డైలాగ్ చెప్పగా ఛ… వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేనా ఆ టైప్ కాదు అంటూ ప్రభాస్ బదులిస్తాడు. అయితే ఈ గ్లింప్స్ కట్ చేసినప్పుడు ఓ అమ్మాయి పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు.. బ్లాక్ కలర్ అమ్మాయి పై క్లోజప్ వేశారు.
అయితే ఆమెపై క్లోజప్ వేయడం అందరిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇక హీరో, హీరోయిన్ తో పాటు ఓ అమ్మాయిని కూడా అలా క్లోజప్ వేశారంటే ఏదో కారణం ఉండే ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా ప్రభాస్ ఇటలీ భాషలో ఓ నా దేవత అని పిలిచిన తర్వాత ఆ అమ్మాయి కనిపించింది. దీంతో అందరిలోనూ ఆమె పాత్రపై సందేశాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమైనా ఉందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.