యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. విక్రమాదిత్య గా ప్రభాస్, ప్రేరణ గా పూజా హెగ్డే కనిపించబోతున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే తాజాగా మరో కీలక అప్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన వాయిస్ అందించారట. ఈ విషయాన్ని తెలియచేస్తూ రాధే శ్యామ్ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే కూడా నటిస్తున్నారు.