ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా మార్చి 11 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యటానికి సిద్ధం అవుతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయట. మెజీషియన్ విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్, పూజా హెగ్డేతో ప్రభాస్ చేసే రొమాంటిక్ ట్రాక్ అందరిని అక్కట్టుకుంటుందట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందట.
సెకండాఫ్ లో లెక్కలేనన్ని మలుపులు ఉంటాయట. ఇక ఈ సినిమా ఐరిష్ జ్యోతిష్యుడు చెయిరో స్ఫూర్తితో తెరకెక్కిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.నిజానికి అతను భారతదేశంలో జ్యోతిష్యం నేర్చుకున్నాడు.
ఆ తరువాత లండన్ వెళ్ళాడు. రాధే శ్యామ్ చివరి 20 నిమిషాల క్లైమాక్స్‌ను కూడా లండన్‌లోని చెయిరో ఉన్న ప్రదేశంలోనే చిత్రీకరించారట. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.