ప్రభాస్, పూజా హెగ్డేల పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధే శ్యామ్ మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రన్‌టైమ్‌పై కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలని, 2 గంటల 18 నిమిషాలు అని పుకార్లు వ్యాపించాయి. సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కూడా ఈ పుకార్లు వ్యాపించాయి.
తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ అధికారికంగా వెల్లడైంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాలట. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో కృష్ణం రాజు, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, సాషా చెత్రి, ఫ్లోరా జాకబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
ఇక అమితాబ్ బచ్చన్, రాజమౌళి, ఫహద్ ఫాసిల్, సత్యరాజ్, శివరాజ్ కుమార్ ఈ చిత్రానికి హిందీ, తెలుగు, మలయాళం, తమిళం మరియు కన్నడ భాషల్లో వాయిస్ ఓవర్ అందించారు.
యూవీ క్రియేషన్స్, టి సీరీస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.