“రాధే శ్యామ్” ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ప్రభాస్ పూజా హెగ్డే ల లుక్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ కొత్త ట్రైలర్ సినీ ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందట. ఎందుకంటే ఈ ట్రైలర్ లో మూడు కొత్త విషయాలను ఉన్నాయట.
మొదటిది థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అఖండ, భీమ్లా నాయక్, సర్కార్ వారి పాట అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లను అందించి టాప్ ఫామ్‌లో ఉన్న థమన్ రాధే శ్యామ్‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఇస్తాడో చూడాలి.
Advertisements
ఇక రెండో అంశం కొత్త షాట్స్. సినిమాకు బజ్ వచ్చేలా ట్రైలర్‌లోనే కొత్త విజువల్స్ ను పొందుపరిచారట. చివరిగా మూడవది రాజమౌళి వాయిస్‌ఓవర్. మరి చూడాలి ఇవన్నీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో. ఇకపోతే రాధే శ్యామ్ సినిమా మార్చి 11న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.