యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ నుంచి మరో సాంగ్ విడుదల కానుంది. ఈనెల 16న రిలీజ్ అవుతున్న ‘సంచారి’ పాటకు సంబంధించిన టీజర్ ను వదిలింది చిత్రబృందం. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ దీన్ని విడుదల చేశారు.
తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా సాంగ్ టీజర్ ను పోస్ట్ చేశాడు.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.