రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా కనిపించబోతున్నాడు. అలాగే భాగ్యశ్రీ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్య రాజు, జగపతిబాబు, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.
Advertisements