రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్ ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచాయి.
ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 11న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
మార్చి 2 సాయంత్రం మూడు గంటలకు ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో బిగ్గెస్ట్ వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ అంటూ రాసుకొచ్చారు.