యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్ రిలీజ్‌కి కాబోతుంది. అయితే తాజాగా బుధవారం మేకర్స్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రాజమౌళి వాయిస్‌ఓవర్ తో మొదలై చేయి చూసి పాస్ట్ నీ, ఫేస్ చూసి ఫ్యూచర్ ని చెప్పేస్తావా? అనే ప్రశ్నతో ఆసక్తి రేపింది ఈ ట్రైలర్.
నువ్వు ఎప్పుడు చస్తావో కూడా చెప్పనా అంటూ ప్రభాస్ డైలాగ్ సినిమా పై హైప్ పెంచేసింది. ఆ తర్వాత పూజా హెగ్డే, జగపతిబాబుల పాత్రలు పరిచయం అవుతాయి. ప్రభాస్ జోతిష్య అంచనాలు నిజమవుతున్నా, పూజా హెగ్డే తన ప్రేమ అంచనాలు ఎప్పుడూ నిజం కాలేదని నమ్ముతుంది. ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధాన్నిఈ ట్రైలర్ హైలైట్ చేసింది.
ఆసక్తికరమైన మలుపులు, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయికి ఎలివేట్ చేశాయి. ఇక కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, సాషా చెత్రి, ఫ్లోరా జాకబ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంకు హిందీ, తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రాజమౌళి, శివరాజ్ కుమార్ మరియు సత్యరాజ్ లు వాయిస్ ను అందించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.