జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే కొన్ని రోజుల్లో ఓ పాట చిత్రీకరణ జరగబోతోందట. ఈ పాటలో మొత్తం 350 మంది డాన్సర్స్ పాల్గొంటారని సమాచారం.
ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో, పూజాహెగ్డే ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ ప్రీ టీజర్ ను రిలీజ్ చెయ్యటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.