యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆడియో సింగిల్స్‌ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి ఉద్ద్ జా పరిందే పాటను రిలీజ్ చేశారు.
ఈ కొత్త వీడియో సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటలో ఎన్నో ప్రయాణాలు, సాహసాలు ప్రభాస్ చేయటం స్పష్టంగా కనిపిస్తుంది. యూరప్‌లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాటను షూట్ చేశారు. మిథూన్, జుబిన్ నౌటియాల్ ఈ పాట పాడారు. అలాగే మిథూన్ సంగీతం కూడా అందించారు. ఇక తెలుగులో సంచారి పేరుతో రిలీజ్ కానుంది . జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటకు సంగీతం అందించారు. ఇక రాధే శ్యామ్ జనవరి 14, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.