ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఓవర్సీస్ లో దుమ్ముదులిపింది. ప్రీమియర్స్ కే 9 లక్ష ల డాలర్లు ఆర్జించిన ఈ సినిమా సునాయాసంగా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు ఈ సినిమాకు 1.2 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లు అన్నమాట.
ప్రభాస్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అతడి సినిమాలు యూఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం సర్వసాధారణం. ఇంతకుముందు బాహుబలి, బాహుబలి-2, సాహో సినిమాలన్నీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా మొదటి రోజుకే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరై సరికొత్త రికార్డ్ సృష్టించింది. అటు ఆస్ట్రేలియా నుంచి కూడా ప్రభాస్ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.
యూఎస్ఏలో ప్రీమియర్స్ తోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ పొజిషన్ లో బాహుబలి-2 నిలవగా.. అజ్ఞాతవాసి, బాహుబలి-1 చిత్రాలు మిగతా 2 స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో ఖైదీ నంబర్ 150 ఉండగా.. ఇప్పుడు ఐదో స్థానంలో రాధేశ్యామ్ నిలిచింది.
రాధేశ్యామ్ సినిమాకు ఇంకా 2 వారాల టైమ్ ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు ఈ సినిమాకు పోటీ లేదు. ఎందుకంటే, భీమ్లానాయక్ హవా ఇప్పటికే తగ్గిపోయింది. సో.. క్లోజింగ్ నాటికి రాధేశ్యామ్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు మంచి లాభాలు కళ్లజూసే అవకాశం ఉంది.