రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
మిగతా భాషల్లో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రాధేశ్యామ్ కు వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. మరీ ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ మరీ ఘోరంగా ఉంది. అక్కడ డిజాస్టర్ అనిపించుకోవడం గ్యారెంటీ. ఉత్తరాదిన ఈ సినిమా హక్కుల్ని దాదాపు 40 కోట్ల రూపాయలకు అమ్మారు. కనీసం 15 కోట్లు రావడం కూడా కష్టంగా ఉందక్కడ పరిస్థితి.
అటు ఓవర్సీస్ లో మాత్రం రాధేశ్యామ్ పరిస్థితి బాగుంది. ప్రీమియర్స్ తో కలుపుకొని 3 రోజుల్లో 1.7 మిలియిన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. రేపోమాపో ఇది 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రాంతాలవారీగా వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 22.30 కోట్లు
సీడెడ్ – 6.65 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.15 కోట్లు
ఈస్ట్ – 3.87 కోట్లు
వెస్ట్ – 2.98 కోట్లు
గుంటూరు – 4.06 కోట్లు
కృష్ణా – 2.34 కోట్లు
నెల్లూరు – 1.88 కోట్లు