RadheShyam Movie Collections: వరల్డ్ వైడ్ నిన్న గ్రాండ్ గా రిలీజైంది రాధేశ్యామ్ సినిమా. ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా నైజాంలో ప్రభాస్ స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. అయితే కలెక్షన్లు భారీగా వచ్చినప్పటికీ.. రికార్డులు మాత్రం సృష్టించలేకపోయింది రాధేశ్యామ్.
రాధేశ్యామ్ కు నిన్న ఒక్క రోజే నైజాంలో 10 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో 10 కోట్ల మార్క్ దాటడం మామాలు విషయం కాదు. నిజానికి ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిందే ప్రభాస్. అతడు నటించిన సాహో సినిమా నైజాంలో తొలిసారిగా 10 కోట్ల మార్జిన్ ను అందుకుంది. అప్పట్నుంచి కొన్ని సినిమాలు ఆ మార్క్ అందుకోసాగాయి. ఇందులో భాగంగా రాధేశ్యామ్ కూడా పది కోట్ల షేర్ అందుకుంది. కానీ నంబర్ వన్ మాత్రం ఇది కాదు.
నైజాంలో మొదటి రోజు వసూళ్లలో రికార్డ్ సృష్టించిన సినిమాగా భీమ్లానాయక్ నిలిచింది. రిలీజైన మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా 11 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ రికార్డ్ ను రాధేశ్యామ్ బీట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ సినిమా 10 కోట్ల 45 లక్షల దగ్గరే ఆగిపోయింది.
రాధేశ్యామ్ సినిమాను నైజాంలో 32 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి రోజు 10 కోట్ల 45 లక్షల రూపాయలు ఆర్జించిన ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 22 కోట్ల రూపాయలు రావాలి. ఈ మొత్తంలో కనీసం సగం ఈరోజు, రేపు వసూలు అవ్వాలి. నైజాంలో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితా ఇది.
#1 భీమ్లానాయక్ – 11.85 కోట్లు
#2 పుష్ప – 11.44 కోట్లు
#3 రాధేశ్యామ్ – 10.45 కోట్లు
#4 సాహో – 10 కోట్లు
#5 బాహుబలి 2 – 8.9 కోట్లు
#6 వకీల్ సాబ్ – 8.75 కోట్లు
#7 సరిలేరు నీకెవ్వరు – 8.67 కోట్లు
#8 సైరా – రూ. 8.10 కోట్లు
Advertisements