సాహో సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ నార్త్ లో వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రాధేశ్యామ్ పై కూడా నెగెటివ్ టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాకు కూడా వంద కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయా? కష్టమే అంటోంది బాలీవుడ్ ట్రేడ్.
సాహో రిలీజయ్యే టైమ్ కు బాలీవుడ్ ఆడియన్స్ పై బాహుబలి-2 ప్రభావం గట్టిగా ఉంది. పైగా సాహో అనేది యాక్షన్ మూవీ. అందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శ్రద్ధా కపూర్ లాంటి బాలీవుడ్ కనెక్ట్ ఉన్న హీరోయిన్లు ఉన్నారు. దీంతో ఆ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది సాహో.
రాధేశ్యామ్ కు అలాంటి అదనపు అడ్వాంటేజీలు లేవు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చింది రాధేశ్యామ్. బాలీవుడ్ కు కనెక్ట్ అయ్యేలా భాగ్యశ్రీ, కునాల్, పూజాహెగ్డే లాంటి వాళ్లను తీసుకున్నప్పటికీ వాళ్లకు స్టార్ అప్పీల్ లేదు. ఇవన్నీ పక్కనపెడితే ఇది యాక్షన్ మూవీ కాదు. అందుకే వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. సరిగ్గా ప్రమోషన్ చేయకపోవడం కూడా ఓ కారణం.
మొదటి రోజు రాధేశఅయామ్ సినిమాకు నార్త్ లో కేవలం 4 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. రెండో రోజు కూడా దాదాపు అదే స్థాయిలో వసూళ్లు అందుకుంది ఈ సినిమా. ప్రస్తుతానికైతే బాలీవుడ్ లో మరో పెద్ద సినిమాతో ప్రభాస్ కు పోటీ లేదు. కాబట్టి ఇంకో వారం ఇలానే సినిమా కొనసాగే అవకాశం ఉంది. కానీ వంద కోట్ల క్లబ్ మాత్రం దాదాపు అసాధ్యమనే విషయం తేలిపోయింది.