ప్రీ-రిలీజ్ బిజినెస్ లో దుమ్ముదులిపింది రాధేశ్యామ్ సినిమా. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా కలిపి చూస్తే.. ఈ సినిమా విడుదలకు ముందే
దాదాపు 40 కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నట్టు లెక్క.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అతడి సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ జరుగుతుంది. అందుకే రాధేశ్యామ్ సినిమా కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఉదాహరణకు తమిళనాడునే తీసుకుంటే.. కోలీవుడ్ లో ఈ సినిమా ఏకంగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అటు ఉత్తరాదిన ఈ సినిమాను ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్మారంటే, ప్రభాస్ మార్కెట్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి-2తో పాటు, సాహో సినిమాకు నార్త్ లో వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అందుకే రాధేశ్యామ్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఇక కర్నాటకలో ఈ సినిమా 12 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 36.50 కోట్లు
సీడెడ్ – 18 కోట్లు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ – 8.80 కోట్లు
వెస్ట్ – 7.50 కోట్లు
కృష్ణా – 7.5 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు
గుంటూరు – 9.90 కోట్లు