ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాను ప్రభాస్ తో పాటు అతడి ఫ్యాన్స్ బలవంతంగా మరిచిపోతున్నారు. అంతలా ఫ్లాప్ అయింది ఈ మూవీ. సాహో తర్వాత ప్రభాస్ కెరీర్ లో భారీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
థియేటర్లలో రిలీజైన చాలా తక్కువ టైమ్ కే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చేసింది రాధేశ్యామ్. అక్కడ కూడా ఈ సినిమాకు ఏమంత ఆదరణ దక్కలేదు. ప్రభాస్ అభిమానులకు ఊరట లభించలేదు. ఇప్పుడీ సినిమా టీవీల్లోకి వస్తోంది.
అవును.. రాధేశ్యామ్ సినిమా బుల్లితెరపైకి రాబోతోంది. ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాధేశ్యామ్ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేయబోతోంది. సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన ఈ సినిమాకు స్మాల్ స్క్రీన్ పై భారీ రేటింగ్ ఆశిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అలాగైనా రాధేశ్యామ్ సినిమా తమకు ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నారు.
ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూవీ నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది.