రాధేశ్యామ్ ప్రమోషన్ చాన్నాళ్ల కిందటే మొదలైంది. టీజర్ తో పాటు లిరికల్ వీడియోస్ కూడా వచ్చాయి. మ్యూజికల్ ఈవెంట్స్ కూడా పెట్టారు. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో అన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు మరోసారి రాథేశ్యామ్ హంగామా మొదలైంది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది. ప్రేమికుల రోజు కానుకగా ఈరోజు రాధేశ్యామ్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే వెంట పడుతుంటాడు. ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ పూజా హెగ్డే మాత్రం నిరాకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంకా ఎందుకు పెళ్లి కాలేదంటూ ప్రభాస్ ను ఆమె ప్రశ్నించే సీన్ టోటల్ గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచింది.
“బాగా కుక్ చేస్తావ్, బాగా మాట్లాడతావ్, మరి ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు” అంటూ పూజా హెగ్డే ప్రశ్నిస్తే, ప్రభాస్ నీళ్లు నములుతాడు. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోను కట్ చేశారు. ఈ వీడియోతో ఇవాళ్టి నుంచి మరోసారి ప్రచారాన్ని ప్రారంభించారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ల పై తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే, విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కింది రాధేశ్యామ్.