బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. పబ్ కు వచ్చిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా తెలుసుకున్నారు పోలీసులు.
డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు పోలీసులు. మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ లో గోవా, ముంబైకి చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం ఉంది.
మేనేజర్ అనిల్ కు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతని కాంటాక్ట్ లిస్టు చూశాక గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన వారి వివరాలు ఉన్నట్లు తెలిసింది. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లుగా ఆధారాలు సేకరించారు పోలీసులు.
నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ పుడింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ బటయపడ్డాయి. పార్టీలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. అందరి వివరాలు సేకరించిన పోలీసులు వారికి ఎలాంటి టెస్టులు చేయకుండానే వదిలేశారు. ఇప్పుడు వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు దొరకడంతో వారికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారు.