సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. చంద్రముఖిగా జ్యోతిక నటన, రజిని స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. కలెక్షన్ ల పరంగా కూడా ఆ రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టాయి. ఇకపోతే గత కొన్నాళ్ళుగా చంద్రముఖి 2 సినిమాపై అనేక పుకార్లు వస్తున్నాయి. వాటిపై దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ స్పందించారు. విషయం పై లారెన్స్ స్పందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అయితే ఇందులో కియారా అద్వానీ, సిమ్రాన్, జ్యోతిక నటిస్తుందని వచ్చిన వార్తలను నేను చూసాను. కానీ ఆ వార్తలు అన్ని పుకార్లే. ఇందులో వారు నటించడంలేదు. అసలు ఈ సినిమాలో నటించనున్న నటీనటుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపాడు.