టాలీవుడ్ లో దర్శకుడు రాఘవేంద్ర రావుది ప్రత్యేకమై స్థానం. ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు కొత్త రంగులనద్దాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనను అందరు కీర్తిస్తుంటే నిర్మాత కాట్రగడ్డ మురారి మాత్రం ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో రాఘవేంద్రరావుని ఉద్దేశించి ఆయనకు అనవసరంగా డాక్టరేట్ ఇచ్చారన్నారు.
1982లో కాట్రగడ్డ మురారి అనే సినిమాను నిర్మిస్తుండగా ఆ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాట ఊటీలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ పాటలో అలా హీరో నడుచుకుంటూ వస్తుండగా… హీరోయిన్ శ్రీదేవి చీర విప్పాలని రాఘవేంద్రరావు ఆమెతో చెప్తాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు సూచించినట్టుగానే శ్రీదేవి చీరను విప్పడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ సీన్ షూట్ ను చూస్తోన్న నిర్మాత కాట్రగడ్డ మురారి పరుగెత్తుకొని శ్రీదేవి వద్దకు చేరుకొని.. ఆయన చీరను విప్పమని చెప్పడం నీవు అలాగే చేయడం ఏంటమ్మా..?ఇలాంటివి అసలు చేయకు అని చెప్తాడు.
దాంతో కాట్రగడ్డపై రాఘవేంద్రరావు ఫైర్ అయ్యాడు. నేను చెప్పిన దానికి అంగీకరించి ఆమె సీన్ చేస్తోంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటని రాఘవేంద్ర రావు నిర్మాతను ప్రశ్నించాడు. దీనికి కాట్రగడ్డ స్పందిస్తూ.. నేను ఈ సినిమా నిర్మాతను. నా సినిమాలో ఇలాంటి అభ్యంతర సన్నివేశాలు ఉండటానికి నేను ఒప్పుకోనని సమాధానమిచ్చాడు. కాట్రగడ్డ జవాబుతో నొచ్చుకొని రాఘవేంద్రరావు..’సర్లే కానీ శ్రీ దేవి నీ పైట జారిపోకుండా ఒక డజన్ పిన్నీసులను నీ చీరకు పెట్టుకో’, అని అన్నాడట. ఇదే విషయాన్ని కాట్రగడ్డ మురారి తను రాసిన నవ్విపోదురుగాక పుస్తకంలో పేర్కొన్నారు.