తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4కు అంతా రెడీ అయ్యింది. సెప్టెంబర్ 6 నుండి ప్రసారం కాబోయే ఈ షోలో డాన్స్ మాస్టర్ రఘు, ఆయన భార్య కంటెస్టెంట్స్ గా ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై రఘు మాస్టర్ క్లారిటీ ఇచ్చారు.
తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ, తను వెళ్లటం లేదని… ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు ప్రకటించాడు. రఘు మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా దూరంగా ఉన్నట్లు ఫిలింనగర్ న్యూ టాక్. మరోవైపు బిగ్ బాస్ లో ఆడబోతున్నారన్న పేర్లు రావటంతోనే బిగ్ బాస్ సెలక్షన్ టీం డ్రాపయ్యారు అన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఎది నిజమో ఏమో కానీ బిగ్ బాస్ 4పై మాత్రం రోజుకో ప్రచారం తెరపైకి వస్తుంది.
ఇక ఈ ప్రచారం అంతా షో పై హైప్ క్రియేట్ చేయ్యటానికే అనే వారు కూడా లేకపోలేదు.