సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి , మంత్రులు వస్తారని ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత వారు ప్రజల కంటికి కూడా కనిపించరన్నారు.
మునుగోడు గడ్డపై కుర్చీవేసి కూర్చుంటా అని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్‌లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ వస్తాయని ఆయన అన్నారు. మద్యం సీసాలు, డబ్బుల సంచులు కాదని కేవలం ధర్మం న్యాయం గెలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల విశ్వసం కోల్పోయిన పార్టీ అన్నారు. తెలంగాణ ప్రజలతో, ఉద్యమకారులతో సీఎం కేసీఆర్ కు బంధం తెగిపోయిందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలను సీఎం మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సమస్యలను పరిష్కరించకుండా, ప్రజలను మభ్య పట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ పేరుతో మరో డ్రామాకు కేసీఆర్ తెరలేపారని ఆరోపించారు. ఈ సారి ముఖ్యమంత్రి జిమ్మిక్కులు పని చేయవన్నారు. దోచుకున్నవి దాచుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ త్వరలో వీఆర్ ఎస్ తీసుకుంటుందన్నారు.