సిద్దిపేటతో సమానంగా కేసీఆర్, హరీష్‌రావు మెడలు వంచి దుబ్బాకు నిధులు తీసుకువస్తామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. గ్రామాల్లో ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా రాలేదని ఆయన ఆరోపించారు. ఈజీఎస్ నిధులతోనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారని, ట్రాక్టర్ల కొనుగోలు కోసం కూడా కేంద్రం ఇచ్చిన నిధులనే ఖర్చు చేశారని అన్నారు. రైతు వేదికకు కూడా కేంద్రం రూ. 12 లక్షలు ఇచ్చిందని.. అలాగే రైతులు తమ కల్లాల కోసం ఈజీఎస్ నిధులను వాడుకోవాలని కేంద్రం చెప్పిందని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి నిధులు తెస్తానని తాను ఎన్నికల ప్రచారంలో ఎక్కడా చెప్పలేదని రఘునందన్ స్పష్టం చేశారు. అయితే దుబ్బాకలో తాను గెలిచనందున నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని తెలిపారు.