రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేనని అందరికీ తెలుసు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటని దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా. అనవసర ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. మీ భార్య బీజేపీలో జాయిన్ అయితే… రాత్రికి రాత్రికి తీసుకెళ్లారు. మళ్లీ ఆమె బీజేపీలోకి వస్తుందేమో చూసుకో.
దుబ్బాకలో బీజేపీ గెలిస్తే.. మోటార్ కు మీటర్లు వస్తాయని హరీష్ రావు అన్నారు. 10 నెలల్లో ఒక్క మోటార్ కైనా మీటర్ వచ్చిందా అని హరీష్ ను ప్రశ్నిస్తున్నా..? సైదాబాద్ లో ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం చేస్తే.. ప్రభుత్వం ఏం చేస్తోంది..? షీ టీమ్ లు ఏం చేస్తున్నాయి..? నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు..?
70వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి ఏది పగలో ఏది రాత్రో తెలియడం లేదు. మామ అల్లుడి పొగరు వంచుదాం. కారులో ఓవర్ లోడ్ అయింది. టైర్లు పగిలాయి. ఇప్పుడు మిగిలింది కమళమే.