సొంతపార్టీపైనే విమర్శలు కురిపిస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకొని సీబీఐ ఆర్థిక నేర విభాగంతో గానీ లేదంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తో కానీ విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలపైనా విచారణ చేపట్టాలన్నారు.
అలాగే కార్పొరేషన్ల ద్వారా ఎలా సేకరించారో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పులు తీసుకునేటప్పుడు ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు.
దీంతో పాటు ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిగే సమయంలో సీఎం జగన్.. అధికారులను సైతం ప్రశ్నించేలా నిబంధన విధించాలని రఘురామరాజు లేఖలో విన్నవించారు.