ఇగో బాగా హర్ట్ అవడం వల్లనో.. లేదా విపరీతమైన కోపం రావడం వల్లనో.. నర్సాపురం ఎంపీగారు.. ఈసారి జగన్ సర్కార్ పరువు తీసేశారు. ఆయన పెట్టుకున్న విగ్ ఊడుద్దా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన దేవేందర్ రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ ఛార్జి.. ఇప్పుడు అధికారికంగా ఏపీ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్… అనవసరంగా రాజుగారిని కదిపినట్లయింది. రాజుగారు చెప్పిన పాయింట్ మీద.. ఎవరైనా లీగల్ గా ప్రొసీడ్ అయితే.. ఈ దేవేందర్ రెడ్డితో పాటు.. చాలామంది సలహాదారుల పదవులు పోతాయి.. ఆ మేరకు ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి. దేవేందర్ రెడ్డితో పాటు.. చాలామంది ఇలాగే ప్రభుత్వంలో పదవులు పొంది.. జీతాలు తీసుకుంటూ.. పనులు మాత్రం వైసీపికో.. సాక్షికో చేస్తున్నారు. ప్రభుత్వంలో అసలు పనే చేయడం లేదు. దేవులపల్లి అమర్ జాతీయ మీడియా సలహాదారుడు పదవిలో ఉన్నారు.. జర్నలిస్టుల స్వేచ్ఛను అణచివేస్తూ ఇచ్చిన జీవోను సమర్ధించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం తప్ప.. వేరే పని ఏమీ చేయలేదు. ఈయన సాక్షి సేవల్లోనే ఉన్నారని చెబుతున్నారు. జీతం మాత్రం ఏపీ సర్కార్ నుంచి వస్తుంది, చేసేది మాత్రం హైదరాబాద్ లో. అలాగే సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తిగారి తంతు కూడా అంతే. ఆయన కూడా జీతం ఇక్కడ.. పని అక్కడ. ఇలాంటివారు దాదాపు ఏడుగురు పైనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరైనా చొరవ తీసుకుని హైకోర్టులో ఇలాంటి పదవులు అనుభవిస్తున్నవారిపై.. కేసులు వేస్తే.. అన్ని సంగతులు బయటపడతాయి. ఎవరు ఏ పదవిలో ఉన్నారు.. పదవిలోకి వచ్చాక.. వారికి సీటు ఎక్కడ కేటాయించారు.. ఆ సీటులో ఆయన ఎన్నిసార్లు కూర్చున్నారు.. ఎన్నిసార్లు ఎన్ని నివేదికలను ప్రభుత్వానికి ఆ హోదాలో ఆయన ఇచ్చారు.. ఇలాంటి లెక్కలన్నీ అడిగితే చాలు.. అసలు సంగతులన్నీ తెలిసిపోతాయి. అవకాశం, అధికారం ఉంది కదాని.. అడ్డగోలుగా ప్రజాధనాన్ని పంచదారలా ఖర్చు పెట్టేస్తుందీ ప్రభుత్వం. ఇక రఘురామకృష్ణంరాజుగారు మరో నగ్న సత్యాన్ని.. అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చాలా గట్టిగా.. బలంగా చెప్పారు. రాష్ట్రంలో రెడ్ టేపిజం కాదు.. రెడ్డీయిజం నడుస్తుందని చెప్పారు. ఎక్కడ ఏ పదవి ఖాళీ ఉన్నా.. ఒక రెడ్డిగారికి ఆ పదవి ఇస్తున్నారని.. రెండురోజులకో రెడ్డిగారికి పదవి లభిస్తుందని ఓపెన్ గా కుండబద్ధలు గొట్టి చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ కావొచ్చు.. మరోటి కావొచ్చు.. ఎక్కడైనా సరే.. రెడ్డి అయితేనే క్వాలిఫైడ్ అన్నట్లు ప్రభుత్వం పదవులు ఇవ్వడంలో ప్రవర్తిస్తుందనేది బహిరంగ రహస్యం.