ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. మాజీ సైనికుల పెన్షన్ అంశంపై కేంద్రాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పలువురు త్రీ స్టార్ అధికారులు సహా వందలాది మంది మాజీ సైనికులకు పెన్షన్ పంపిణీ చేయకపోవడంపై మోడీ సర్కార్ పై ఆయన మండిపడ్డారు. మాజీ సైనికాధికారులకు పెన్షన్ పంపిణీ చేయకుండా దేశాన్ని మోడీ అవమానపరిచారని ఆయన ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.
‘ ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ ‘ కుంభకోణం తర్వాత మోడీ సర్కార్ ఇప్పుడు అన్ని ర్యాంకులు.. నో పెన్షన్ అనే పథకాన్ని తీసుకుంటోందని సెటైర్లు వేశారు. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ కు ఆయన జత చేశారు.
సైనికులను అవమానపరచడం అంటే దేశాన్ని అవమానపరచడమేనని ఆయన అన్నారు. ఇకనైనా కేంద్రం కండ్లు తెరిచి మాజీ సైనికులకు వెంటనే పెన్షన్ లు పంపిణీ చేయాలని సూచించారు.