నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయానికి రాహుల్ బయలు దేరగా ఆయన వెంట ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానీ కొంత మంది పోలీసుల నుంచి తప్పించుకుని రాహుల్ వెంట ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఈరోజు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి రాహల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి భారీ ర్యాలీతో వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్ నేతలు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకున్నారు.
Advertisements
ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.