దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి దూర దృష్టిగల నాయకుడని రాహుల్ అన్నారు. రాజీవ్ విధానాలు ఆధునిక భారత్ నిర్మాణానికి ఉపయోగపడ్డాయని ఆయన ట్వీట్ చేశారు.
తన తండ్రి చాలా దయగల నాయకుడని, తనకు, తన సోదరి ప్రియాంకకు రాజీవ్ గొప్ప తండ్రి అని పేర్కొన్నారు. క్షమాగుణం వంటి విలువలను ఆయన తమకు నేర్పించారని ఆయన చెప్పారు.
తన తండ్రిని తాను చాలా మిస్ అవుతున్నానని వాపోయారు. ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఈ నెల 23న లండన్ వెళ్లనున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీలు రాజీవ్ గాంధీకి శనివారం నివాళులు అర్పించారు. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఇతర కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.