భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాటర్ ట్యాంకు ఎక్కారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ట్యాంకుపై జాతీయ జెండాను ఆయన రెపరెపలాండించారు.
ఆయన వాటర్ ట్యాంకు ఎక్కడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ఫుల్ జోష్ లో ఉన్నారు. యాత్రలో భాగంగా ఓ గ్రామంలో ఆయన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు.
చేతిలో జాతీయ జెండాను పట్టుకుని గ్రామస్తులకు ఆయన అభివాదం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం శిద్దరామయ్య కూడా వాటర్ ట్యాంక్ ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్‌లో తిరంగా జెండా మనందరినీ ఏకం చేసిందని పేర్కొంది. త్రివర్ణ పతాకం నిజమైన సారాన్ని ఈ భారత్ జోడో యాత్ర స్వీకరిస్తుందని పేర్కొంది. గత నెల 30న యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. ఈ నెల 20న కర్ణాటకలో యాత్ర ముగుస్తుంది.