గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘ నేడు గ్యాస్ ధరలు పెరిగాయి. రేపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అనుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.
‘ గ్యాస్ ధరలను పెంచుతూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సామాన్యుల కష్టాలను తాము పట్టిచుకోవడం లేదని మోడీ సర్కార్ ఈ పెంపు ద్వారా స్పష్టం చేసింది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.
దేశంలో గ్యాస్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ పై భారీగా రూ. 105లు పెంచుతున్నట్టు ప్రకటించాయి.
5 కేజీల సిలిండర్ పై ధర రూ. 27 లను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఇక డొమెస్టిక్ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులను కంపెనీలు చేయలేదు.