కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 39వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా వెనుకడుగు వేయకుండా రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ఆరుసార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా.. ప్రతిష్టంభన తొలగలేదు. రేపు( జనవరి 4 ) మరోసారి చర్చలు జరగనున్నాయి. కాగా కేంద్రం వైఖరిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
రైతుల ఆందోళనను సత్యాగ్రహ ఉద్యమంతో పోల్చారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నిరసనల్లో కూర్చున్న ప్రతి రైతూ దేశభక్తుడైన సత్యాగ్రహియే అని అన్నారు. ఈ ఆందోళనను చూస్తోంటే.. చంపారన్ గుర్తుకు వస్తోందని అన్నారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ కంపెనీకి బలం ఉంటే…. ఇప్పుడు మోదీ మిత్రుల కంపెనీకి బలం ఉందని విమర్శించారు. ఈ ఉద్యమంలో ప్రతి రైతూ తమ హక్కును పొందుతారని రాహుల్ అన్నారు.
देश एक बार फिर चंपारन जैसी त्रासदी झेलने जा रहा है।
तब अंग्रेज कम्पनी बहादुर था, अब मोदी-मित्र कम्पनी बहादुर हैं।
लेकिन आंदोलन का हर एक किसान-मज़दूर सत्याग्रही है जो अपना अधिकार लेकर ही रहेगा।
— Rahul Gandhi (@RahulGandhi) January 3, 2021
కాగా నీలి మందు పండించాలనే బ్రిటిష్ పాలకుల నిర్బంధానికి వ్యతిరేకిస్తూ.. బిహార్‌లోని చంపారన్‌లో స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రైతులు సత్యాగ్రహం చేశారు.