కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రక్షణ రంగానికి తక్కువ కేటాయింపులు జరిపి.. శత్రుదేశానికి ఏం సందేశాన్ని పంపుతున్నారని ప్రశ్నించారు.
చైనా ఇప్పటికే భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడమే గాక.. కొంత భాగాన్ని కూడా ఆక్రమించిందని ఆరోపించిన రాహుల్ గాంధీ.. బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించిన కేటాయింపులను కేవలం రూ.3000 కోట్ల నుంచి రూ.4000 కోట్లు మాత్రమే కేంద్రం పెంచిందని గుర్తు చేశారు. ఇంత తక్కు పెంపుతో శత్రు దేశానికి ఏం సందేశం పంపుతున్నారని నిలదీశారు. అంటే చైనా తమకిష్టమైనప్పుడు ఇండియాలోకి రావచ్చు..ఏమైనా చేసుకోవచ్చు.. మేం మాత్రం మా రక్షణ బలగాలకు అండా ఉండబోం అనే సందేశాన్ని పంపదలచారా..? అంటూ కేంద్రంపై నిప్పులు కక్కారు రాహుల్ గాంధీ.