కేంద్రం నూతనంగా తీసుకు వస్తున్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది దళాల “కార్యాచరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది” అని అన్నారు.
భారతదేశం రెండు రంగాల్లో ముప్పును ఎదుర్కుంటోందన్నారు. దేశ సాయుధ దళాల గౌరవం, సంప్రదాయాలు, శౌర్యం,వాటి క్రమశిక్షణతో బీజేపీ ప్రభుత్వం రాజీ పడటం మానేయాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
సాయుధ దళాల నియామక ప్రక్రియకు సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. దీని కింద సిబ్బందిని నాలుగేండ్ల కాలపరిధికి రిక్రూట్ చేయనున్నట్టు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్ని వీరులకు పారా మిలటరీ దళాలు, అసోం రైఫిల్స్ దళాల ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.