నిరుద్యోగం అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉద్యోగం పొందాలనే ఆశను కోల్పోయారని రాహుల్ అన్నారు.
గత ఐదేండ్లలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ఓ సంస్థ ఇచ్చిన నివేదికను ఆయన షేర్ చేశారు. సుమారు 45 కోట్ల మంది అసలు ఉద్యోగాల వేటను ఆపివేసినట్టు అందులో సంస్థ పేర్కొంది.
75 ఏండ్ల భారత చరిత్రలో అలా చేసిన తొలి ప్రధాని మోడీనేనని ఆయన విరుచుకుపడ్డారు. ఇండియా కొత్త నినాదం.. ప్రతి ఇంటికి నిరుద్యోగం.. ఇంటింటికి నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు.
ఇదే నివేదికను ఊటంకిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. దీని కన్నా యువత భవిష్యత్ కు పెద్ద ప్రమాదం మరేదీ లేదన్నారు.