కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. ప్రభుత్వం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్విట్ చేశారు. GDP (పెట్రోల్ ధరలు) విషయంలో ప్రధాని మోదీ అద్భుతమైన అభివృద్ధిని సాధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో కష్టాలుపడుతోంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లలో ఉందంటూ కామెంట్ చేశారు.
వారం రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ముంబైలో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 92 రూపాయలు దాటింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని.. దేశ అవసరాల మేరకు ఎంత ఖర్చు పెట్టయినా దిగుమతి చేసుకోకతప్పడం లేదని కేంద్రం చెబుతోంది.