తన సుదీర్ఘ ‘భారత్ జోడో పాద యాత్ర’ ముగిసింది. ఇక ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. వెకేషన్ మూడ్ లోకి వచ్చారు. కాస్త సేద దేరేందుకు చల్లని జమ్మూ కశ్మీర్ చేరుకొని అక్కడి గుల్మార్గ్ రిసార్ట్ వద్ద మంచు కొండల్లో స్కై వాక్ చేస్తూ.. ప్రముఖ ‘గొండోలా కేబుల్ కార్’ మీద ‘షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పనులమీద నార్త్ కశ్మీర్ వచ్చిన రాహుల్ గాంధీ.. సరదాగా ఇలా ఎంజాయ్ చేస్తుంటే చూస్తున్నవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు కూడా ఆయన ట్రేడ్ మార్క్ వైట్ షర్ట్ ధరించి కనబడ్డారు. అయితే అప్పుడప్పుడు చలిని భరించలేనట్టుగా వెచ్చని ఉలెన్ క్యాప్, హెవీ డ్యూటీ జాకెట్, షూస్ ధరించి కూడా తన సరదాలను తీర్చుకుంటున్నారు. ఇన్స్ట్రక్టర్లు జాగ్రత్త పడమని సూచనలు చేస్తుంటే ఆయన బ్యాలెన్సింగ్ గా స్కై వాక్ చేయడం విశేషం.
తంగ్ మార్గ్ టౌన్ లో రాహుల్.. దేశ సమస్యలేవీ పట్టనట్టు మంచు ‘తిన్నె’లపై తన వెకేషన్ మూడ్ ని ‘పరిచారు’. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. ఆయన నుంచి ‘నమస్కార్’ అన్న వ్యాఖ్యే వచ్చింది. అయితే టూరిస్టులతో కలిసి వారితో సెల్ఫీలు దిగారు. తమ వీవీఐపీని అనుసరించలేక రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు
తన పర్సనల్ విజిట్ పై రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని, గురువారం సాయంత్రం ఆయన ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరయ్యే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఏమైనా.. తమ నేత ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల తాలూకు ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
.