కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నా మాటను గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వినండి. కచ్చితంగా ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పదు. నా మాట రాసి పెట్టుకోండి రాహుల్ అన్నారు.
ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన కేంద్రం… ఓ వైపు రైతులను తొక్కేస్తూ, మరోవైపు పారిశ్రామిక వేత్తలకు కేంద్రం సహాయం చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ కేంద్రం సాధారణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని, మోడీ ఎవరి ప్రధాని మంత్రో చెప్పాలని నిలదీశారు. మోడీ కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రధాన మంత్రా అంటూ ప్రశ్నించారు.