దారుణ హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసేవాల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పరామర్శించారు. సిద్దూ స్వగ్రామంలో వారిని రాహుల్ కలుసుకున్నారు.
ఆయనతో పాటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత ప్రతాప్ సింగ్ భజ్వా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పార్టీలోని ఇతర నాయకులు రాహుల్ వెంట వెళ్లారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సిద్దూ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉందని రాహుల్ అన్నారు. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. వారికి న్యాయం జరిగేలా చూసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ తెలిపారు.
రాష్ట్రంలోని ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ ను పాలించే సామర్థ్యం ఆప్ పార్టీకి లేదన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఆప్ సర్కార్ విఫలమైందన్నారు.