కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరి కొద్ది సేపట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు.
రాహుల్ కు మద్దతుగా పార్టీ సీనియర్ నేతలు సైతం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరిత్తించారు. రాహుల్ సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
అనుమతులు లేకండా నిరసన ప్రదర్శనలకు దిగారంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ జాబితాలో వున్న సీనియర్ నేతలకు మాత్రమే ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.