కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తికి పప్పు అని ఇమేజ్ రావడం చాలా దురదృష్టకరమైన విషయమని పేర్కొన్నారు.
వాస్తవంగా రాహుల్ గాంధీ చాలా తెలివైన వ్యక్తి అని అన్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో భాగంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సుమారు 10 ఏండ్ల పాటు తాను వారితో సన్నిహితంగా ఉన్నానని వెల్లడించారు.
రాహుల్ గాంధీ పప్పు (ఫూల్) కాదన్నారు. ఆయనొక మంచి తెలివైన వ్యక్తి (స్మార్ట్ మెన్) అంటూ ప్రశంసించారు. ఆయన యువ రక్తం కల వ్యక్తి, ఆసక్తిగల వ్యక్తంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సవాళ్లతో పాటు వాటి వల్ల కలిగే నష్టాలను కూడా అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు.
ఆ విషయంలో రాహుల్ గాంధీ చాలా సమర్థుడని ఆయన వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తాను కీలకంగా వ్యవహరించానని ఆయన వివరించారు. భారత్ జోడో యాత్ర విలువల కోసం కట్టుబడి ఉందన్నారు. అందుకే తాను ఆ యాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు.