కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరి మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన జ్యోతిరాదిత్య సింథియాపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో జ్యతిరాదిత్య సింథియా ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యేందుకైనా..ఎప్పటికైనా ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారని జోస్యం చెప్పారు. కావాలంటే తాను చెప్పిన మాటను రాసిపెట్టుకోండి అంటూ పార్టీ శ్రేణులతో అన్నారు.
సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యేవాడన్నారు రాహుల్. కానీ బీజేపీలోకి వెళ్లి బ్యాక్ బెంచర్‌గా మారిపోయారని సైటర్ వేశారు.ఢిల్లీలో కాంగ్రెస్ యూత్ వింగ్‌తో సమావేశమైన రాహుల్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ భావజాలంపై పోరాటం చేయాలని యువజన కార్యకర్తలను పిలుపునిచ్చారు.
కాగా, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరి ఉన్న సమయంలో… ఆయనతో విబేధాలు, అలాగే రాజ్యసభ అభ్యర్థిగా తనకు కాకుండా ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు అవకాశం ఇవ్వడం వంటి కారణంగా గతేడాది మార్చ్‌లో సింథియా కాంగ్రెస్ పార్టీని వీడారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రతిఫలంగా సింథియాను బీజేపీ రాజ్యసభ ఎంపీగా పంపింది.